మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ మృతి చాలా బాధాకరంఎమ్మెల్సీ

0 13

కోరుట్ల ముచ్చట్లు :

 

మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్ అకాల మృతి బాధాకరమని
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆన్నారు.బుధవారం ఎమ్మెల్సీ మెట్ పెల్లి పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు.
ఈసందర్భంగా బాల్క సురేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బాల్క సురేష్ అకస్మాత్తుగా మృతి చెందడం తమకు తీర్చలేని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అలాగే ఇటీవల మరణించిన ఏషాల శేఖర్ ,బాజోజీ భాస్కర్, డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ తల్లి మరణించగా వారి కుటుంబాలకు
ఎమ్మెల్సీ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ పరామర్శలో
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట మెట్ పల్లి  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దీన్ పాషా, సీనియర్ నాయకులు జెట్టి లింగం, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, సింగల్ విండో మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, కిసాన్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The death of former market committee chairman Balka Suresh is very sad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page