రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోంది

0 20

హైదరాబాద్ ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అనేక మంది అమర వీరుల బలిదానాలు, వల్ల తెలంగాణ సిద్దించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం అయన గన్ పార్క్ వద్ద జరిగిన తెలంగాణ ఆవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గోన్నారు. సంజయ్ మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ బీజేపీ పోరాటాలు చేస్తుంది. అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో మూర్ఖత్వపు  పాలన నడుస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడే అర్హత లేదు. ఓటింగ్ లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు.. ఏ విదంగా ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉంది. తెలంగాణ ఏర్పాటు కావాలని కేసీఆర్ కు  లేకుండే.. అందుకే ఆయన ఓటింగ్ లో పాల్గొనకుండా ఇంట్లో సేద తీరాడు. టిఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ మొదలు అయింది. ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు నేడు రాజ్యం ఎలుతున్నారని అన్నారు.

 

 

 

- Advertisement -

తెలంగాణ తల్లికి బంధ విముక్తి చేయడానికి బీజేపీ పోరాటం చేస్తోంది. టిఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి ఉంది కాబట్టే ఉద్యమకారులు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ మద్దతు లేకుంటే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదు. గత చరిత్ర తెరమరుగు చేయడానికి కేసీఆర్ అమరుల దినోత్సవం జరపడం లేదు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం ఒవైసీ కుటుంబం మాత్రమేనని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Foolish rule is running rampant in the state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page