వరుసకు సోదరుడితో పెళ్లి…

0 27

మెదక్ ముచ్చట్లు:

 

వరుసకు సోదరుడైన వ్యక్తిని ప్రేమించింది. అతనితో వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లి పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాడ్గుల మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్‌ 18న ఓ బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ ప్రేమించానంటూ తన వెంట తీసుకెళ్లిపోయాడు. ఆమె అతనికి వరుసకు సోదరి అవుతుంది.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై బద్యానాయక్‌ నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు గాలించి ఇద్దర్ని వెనక్కు తీసుకొచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వెంకటేష్‌ను మే నెల 25న కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపారు. ఈ క్రమంలో తల్లి, బాలిక మధ్య ప్రేమ, పెళ్లి విషయంలో వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన తల్లి సోమవారం పొలంలో పురుగు మందుతాగి మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే కోపంతో గ్రామస్థుడు ఒకరు వెంకటేష్‌ గుడిసెను తగులబెట్టాడు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Married to a brother in a row …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page