వికారాబాద్ లో అవతరణ దినోత్సవం

0 20

వికారాబాద్ ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది.  ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు.. పద్మారావు మాట్లాడుతూ  అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రం సాధించుకొని ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్రప్రజలకు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు…బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని పద్మారావు పేర్కొన్నారు. రాష్ట్రప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు డాక్టర్ మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ విజయ్ కుమార్, కలెక్టర్ పౌసమి బస్సు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Telangana Landing Day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page