సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ

0 18

అమరవీరుల త్యాగాల ఫలితం రాష్ట్ర సాధన
లక్ష 33 వేల ప్రభుత్వ, 15 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన
75 లక్షలు ఎకరాలు అదనంగా సాగులోకి
అదనంగా కోటి  మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఎస్ ఆర్ ఎస్ పి  పునరుజ్జీవం, ప్యాకేజీ 21 ద్వారా సాగులో లేని భూములకు సాగునీరు
అందరి సహకారంతో కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి
– రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ ముచ్చట్లు :

- Advertisement -

అమరవీరుల త్యాగాల ఫలితం, మరెందరో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా, తల ఎత్తుకొని ఉండేవిధంగా తీర్చిదిద్దుకున్నా మని, ఉద్యమ నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వేళ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో, అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముందుకు వెళుతున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ  వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన  ముఖ్య అతిథిగా హాజరై వినాయక నగర్ లోని అమరవీరుల స్థూపం వద్ద పూలు చల్లి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో నిరాడంబరంగా ఏర్పాటుచేసిన పతాక ఆవిష్కరణ గావించి పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర  ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

15 సంవత్సరాల రాష్ట్ర  సాధనకు ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం, ప్రజలందరి పోరాటాల ద్వారా సాధించుకున్న రాష్ట్రాన్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని తద్వారా  తల ఎత్తుకొని నిలబడగలిగామన్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి ఎన్నో వేల గంటలు రాత్రింబవళ్లు ఆలోచనలు చేసి, చర్చించి ప్రజల కొరకు ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్స్, టుబిహెచ్కె, రెసిడెన్షియల్ స్కూల్స్, 24 గంటల కరెంటు, కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు , చెక్ డ్యామ్ల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా తదితర ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వారు తెలిపారు.
సమైక్య పాలనలో మనకు దక్కని ప్రజలు నోచుకోని అన్నింటిని ఒకటొకటిగా పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణను అన్ని రంగాలలో ముందు వరుసలో నిలబెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉన్నామన్నారు. ఒక లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్  రంగంలో  15 లక్షల ఉద్యోగాలు కల్పించామని, దేనికోసం అయితే రాష్ట్రాన్ని  పోరాడి సాధించుకున్నామో ఈరోజు దాన్ని గర్వంగా నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రం ఏర్పడక ముందు  కోటి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందగా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరో 75 లక్షలకు సాగునీటిని అభివృద్ధి చేసుకొని 2 కోట్ల 15 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చామన్నారు.

 

 

 

 

గతంలో  25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కోటీ 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడంతో పాటు  దేశానికి ధాన్యాన్ని అందిస్తున్న రాష్ట్రంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. జిల్లాలో  ఎస్ ఆర్ ఎస్ పి పునరుజ్జీవ పథకంలో భాగంగా పనులు దాదాపుగా పూర్తి  కావచ్చాయని కాళేశ్వరం నుండి  300 కిలోమీటర్లు నుండి నీటిని తెచ్చి ఎస్ఆర్ఎస్పీ లో నింపడానికి కొద్దిరోజుల్లోనే చూడబోతున్నామని తెలిపారు.  అదేవిధంగా ప్యాకేజ్ 21 ద్వారా సాగులో లేని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని రెండు లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వచ్చే కార్యక్రమం త్వరలోనే మొదలు కాబోతోందని తెలిపారు. ఇవన్నీ కూడా  ముఖ్యమంత్రి  జనరంజకమైన పాలన వలనే సాధ్యమైందని వివరించారు. ప్రజల కలలు సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలను అమలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇందులో భాగంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, మిగతా అధికారుల సహాయ సహకారాలతో జిల్లాను కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

 

 

 

 

అనంతరం సమీకృత మార్కెట్ నిర్మాణానికి  స్థానిక డి ఈ ఓ కార్యాలయ స్థలాన్ని, పాత తహసిల్ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ దిశగా ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఆకుల లలిత, గంగాధర్ గౌడ్, సిపి కార్తికేయ, డిఎఫ్ఓ సునీల్, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్లు చంద్ర శేఖర్, లత, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Telangana is the number one state in the country through all-round development programs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page