7 వసంతాల కాలంలో అద్భుత ఫలితాలను సాధించాం

0 18

-రాష్ట సంక్షేమశాఖ మంత్రి  కోప్పుల ఈశ్వర్

జగిత్యాల ముచ్చట్లు :

 

- Advertisement -

ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు 7 వసంతాలు పూర్తి చేసుకొని అనతి కాలంలోనే అనేక అద్బుత విజయాలను సాధించు కొవడం జరిగిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  కోప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారంజూన్-2 తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి ముందుగా తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలవేసి అనంతరం తెలంగాణ సాధన కోసం పోరాడి అసువులు బాసిన అమరుల కొరకు ఏర్పాటు చేసిన  అమరవీరుల స్థూపం వద్ద మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్,గోగులోత్ రవి ,జిల్లా ఎస్పీ సీంధుశర్మ,
, జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్. సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత -సురేష్, మున్సిపల్  చైర్ పర్సన్ భోగ శ్రావణి,చైర్మన్ ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినఆవిర్భావ వేడుకలలో పాల్గోన్న మంత్రి వర్యులు ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి ఉదయం 09:00 గంటలకు త్రివర్ణపతాక ఆవిష్కరణ గావించారు.   అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, విజయవంతంగా 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ప్రజలకు, ప్రతినిధులకు, అధికారులకు శుభాకాంక్షలను తెలియజేశారు.

 

 

 

 

దేశంలోనే ప్యాడిప్రోక్యూర్ మెంట్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని,  తెలంగాణ 12 లక్షల ఎకరాల సాగు నుండి, తెలంగాణ ఆవిర్బావం అనంతరం 53 లక్షల ఎకరాలలో 2 పంటలు కలిపి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఘనత కేవలం తెలంగాణకు మాత్రమే దగ్కిందని అన్నారు.  ఆద్బుత విజయాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అన్ని అందులో ప్రధానంగా 24 గంటల కరెంట్, గ్రామాల అభివృద్ది కొరకు పల్లెప్రగతి, పట్టణాల సుందరీకరణకు పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా అద్బుత విజయాలను సాధించడం జరిగిందని పేర్కోన్నారు.  ప్రజలను అతలాకుతలం చేస్తున్న కోవిడ్ ను సైతం సమర్దవంతంగా ఎదుర్కొవడంలో ప్రజలకు జవాబుదారిగా నిలిచి ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రజలకు ఏమాత్రంకూడా రాకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలలో అద్బుతమైన వైద్య సేవలను అందిస్తు ప్రజలకు దైర్యాన్ని ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమే అని అన్నారు.   రాష్ట్రముఖ్యమంత్రి  ప్రణాళికబద్దంగా తెలంగాణ కోల్పోయిన అభివృద్దిని 7వ వసంతాల కాలంలో సాధించారనడానికి జగిత్యాలలో మెడికల్ కాలేజీని ఏర్పాటు ఒక ఉదాహరణగా అభివర్ణించారు.

 

 

 

 

కార్యక్రమ చివరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కఠిన సేవా పథకాన్ని మంత్రి కోప్పుల ఈశ్వర్ జిల్లా అడిషనల్ ఎస్పీ కె. సురేష్ కి ఆందజేశారు.  అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల, మాతశీశు సంక్షేమ కేంద్రం , తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ ల నిర్మాణా పనులను పరిశీలించారు. జిల్లా ఆవిర్బావంతో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయితీలను  రూపొందించుకోవడం జరిగింది. కొత్త కలెక్టర్ కార్యాలయ భవనాన్ని రాబోయోరోజులకు సరిపడే విధంగా అన్నిరకాల వసతులతో పట్టణ కేంద్రంలో నిర్మించుకోవడం జరిగిందని,  100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తికావస్తుందని.  భవిష్యత్తులో అన్ని వసతులతో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేలా  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని,  నూతన కలెక్టర్ కార్యాలయ భవనంతో పాటు పార్ట్తి

 

 

 

ఆఫీసు ప్రారంభోత్సవానికి రాష్ట ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నందని, పర్యటన ఖరారు .అయిన వెంటనే మిగిలిన ఏర్పాట్లను పూర్తిచేసుకొవడం జరుగుతుందని తెలియజేశారు. పాడి పంటలకు నిలయమైన జగిత్యాల జిల్లాను అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలన యంత్రాంగం బాగా పనిచేసి జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి,  జిల్లా ఎస్పీ సిందుశర్మ, జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Achieved amazing results over a period of 7 springs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page