అగ్ని ప్రమాద బాధితులకు ఇంటి సామాగ్రి పంపిణీ

0 8

సామర్లకోట ముచ్చట్లు:
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్ లైన్ వీధిలో ఇటీవల  జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశులైన బాధిత కుటుంబాలకు  రాష్ట్ర రెల్లి సంఘం ఆధ్వర్యంలో   బాధిత కుటుంబాలకు బీరువాలు. మంచాలు. బియ్యం డబ్బాలు. ఫ్యాన్లు.కుక్కర్లు. కుర్చీలు. దుప్పట్లు. 25 కేజీల బియ్యం బస్తాలు.కిరాణా సామాన్లు. వంటసామాన్లు. వంద రకాల చీరలు. 50 ప్యాంటు షర్ట్స్. అలాగే 5 మంది రెల్లి కులస్తులకు ఒక్కొక్క  కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున మరో వేరే కులానికి సంబంధించిన కుటుంబానికి ఎనిమిది వేల రూపాయలుచెప్పిన అందించారు.
రాష్ట్ర రెల్లి సంఘ అధ్యక్షులు మీడియాతో  మాట్లాడుతూ మా పిలుపు మేరకు వచ్చి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి రేల్లీ యువ సేన టీమ్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వం కూడా ఆ కుటుంబం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర రేల్లి  సంఘ అధ్యక్షులు ముత్యాల ఈశ్వరి. సెక్రటరీ Y. కె రాజు. ట్రెజరర్  నీలపు రామ్ ప్రసాద్. సభ్యులు బంగారు రాము. అలాగే భీమవరం నుండి అడపా బాలాజీ. ధనాసాల చిన్న పెద్దిరాజు. బంగారు యేసేబు. అలాగే అక్షయ పౌండేషన్ నాయకులు వేరేటి సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Distribution of household items to fire victims

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page