ఆటోడ్రైవర్స్ కి అండగా సంధ్యక్క

0 19

పెద్దపల్లి  ముచ్చట్లు:

నిత్యం పేదవాళ్ళన్ని ప్రయాణంలో వారి వారి గమ్యాన్ని చేర్చే ఆటోడ్రైవర్స్ నేడు కరోనా కారణంగా ఇల్లుగడవని పరిస్థితులో కొట్టుమిట్టాడుతున్నారు. వారి కష్టాలను గమనించినటువంటి పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోచం రాజేష్ థియేటర్ ఆటో స్టాండ్ లోని 50మంది ఆటోడ్రైవర్స్ కి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ మా ఇంటి ఆడబిడ్డగా మా బాగుకోరుకునే నీకు ఎల్లప్పుడు అన్నదమ్ములలా నీ వెన్నంటే ఉంటామని చెప్పారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నా ఊపిరి ఉన్నంతవరకు మీకు ఏ  కష్టం వచ్చినా నేను మీకు ఉన్నాననీ, నా శక్తికి మించి మీకు సహాయం చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిలకంటి రాము, వడ్లకొండ మహేందర్ (మాజీ ప్రెసిడెంట్ ఆటో యూనియన్), అయిండాల సదానందం, ఇప్పలపల్లి సంపత్, బుద్దరద్దీ శ్రీనివాస్, గాజుల రాజశేఖర్, లెంకల వెంకటేష్, బడికెల సురేష్, ఆండ్రా ప్రదీప్, చిలుముల ప్రశాంత్, రేణికుంట్ల, సురేష్ తదితర ఆటోడ్రైవర్స్ పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Good evening to autodrivers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page