ఆత్యవసరమైతే తప్ప బయటకు రాకండి

0 21

– లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తాం
– ఓఎస్డీ శరత్ చంద్ర పవార్

పెద్దపల్లి  ముచ్చట్లు:

- Advertisement -

కరోన నియంత్రణ కోసం గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో చేపట్టిన లాక్ డౌన్ అమలును ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ నిభందనలలో కొన్ని మార్పులు చేసి మరలా 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ప్రజలు తమ నిత్యావసరాల కోసం బయటకు రావచ్చని సడలింపు ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని పోలిస్ కమిషనర్ అన్నారు. లాక్ డౌన్ సడలింపు సమయo ఇప్పుడు 1:00 గంట వరకు ఇవ్వడం జరిగింది అప్పటి వరకు షాప్ లు, అన్ని పనులు ముగుంచి కొని ఇంటికి వెళ్ళాలని తెలిపారు. ప్రజలు గమ్యస్థానాలకి చేరుకోవాడనికి మరో గంట సమయం ఇవ్వడం జరిగింది కనుక ప్రజలు ఇచ్చిన సమయంను సద్వినియోగం చేసుకొని ఇండ్లకు చేరుకోవాలి అని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలని ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ అన్నారు. కోవిడ్ నిబందనలు అతిక్రమించిన 25 వాహనాలను సిజ్ చేశామని అన్నారు. ప్రజలందరూ ప్రబుత్వం రూపొందించిన కోవిడ్ రూల్స్ ను అనుసరించి ప్రతి ఒక్కరూ నిత్యం మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వీయనియంత్రణ కలిగి ఉండాలని కోరారు. అనంతరం రోడ్ల పై తిరుగుతున్నా వాహనదారులకు లాక్ డౌన్ పై అవగాహన కల్పించి మందలించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్, ఉమాసాగర్, రమేష్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ గార్డ్స్ పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Do not come out unless absolutely necessary

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page