ఆనందయ్య కంటి చుక్కల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు .హైకోర్టుకు విన్నవించిన ఏపీ ప్రభుత్వం

0 28

అమరావతి ముచ్చట్లు:
కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్యాకింగ్‌, స్టోరేజ్‌కు కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం  ఉందని కోర్టుకు తెలిపింది. మూడు నెలల తర్వాతే పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఆనందయ్య కంటి చుక్కల మందుపై గురువారం హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కోర్టుకు తన వాదనలు
వినిపించింది.జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి నుంచి ఆనందయ్య కంటి చుక్కల మందుపై నివేదిక అందిందని స్పష్టం చేసింది. భోజన విరామం దృష్ట్యా విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. కంట్లో వేసే చుక్కల మందు పంపిణీకి
అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. చుక్కల మందు మినహా మిగిలిన మందుల పంపిణీ గత సోమవారం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే మంందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి
నివేదిక రావాల్సి ఉన్నందున రెండు వారాల సమయం కావాలని కోర్టును ప్రభుత్వం అభ్యర్థించిన విషయం తెలిసిందే.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:There are no side effects with Anandayya eye drops
The AP government appealed to the High Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page