ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

0 20

తాడిపత్రి ముచ్చట్లు :

 

 

ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. రాజరాజేశ్వరీ (25) ఎంబీఏ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. తండ్రి చనిపోవడంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. ఇటీవల తల్లి, సోదరుడికి కరోనా రావడంతో వారు ఆస్పత్రిలో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం తర్వాత గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు తలుపులు పగులగొట్టారు. ఆమె ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Suicide for not getting a job

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page