ఐసీఐసీఐ దాతృత్వం అభినందనీయం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

0 29

పెద్దపల్లి  ముచ్చట్లు:

కరోనా కష్ట సమయంలో ఐసిఐసిఐ దాతృత్వ అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్ తుంగ, పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ తునికి, రిలేషన్ షిప్ మేనేజర్ నవీన్ పసిడ్ల, అసిస్టెంట్ మేనేజర్ కలెగూర ప్రణయ్ లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో కరోనా వచ్చిన వారికి ఆక్సిజన్ ఎంతో అవసరమని అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా ఐసీఐసీఐ బ్యాంక్, పెద్దపల్లి శాఖ ఉచితంగా అందించి దాతృత్వాని చాటుకోవడం అభినందనీయమని  జిల్లా కలెక్టర్ అన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు వారు అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను వెంటనే జిల్లా వైద్యాధికారికి అప్పగించారు. కరోనా వచ్చి ఇంటికి వెళ్లిన వారికి సైతం ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు ఎంతగానో ఉపయోగపడుతాయని వైద్యాధికారి తెలిపారు. అందించిన ఐసీఐసీఐ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, సి.పి. సత్యనారాయణ, డి.సి.పి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:ICICI’s generosity is commendable
– District Collector Dr. Sangeetha Satyanarayana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page