కంటోన్మెంట్‌ జోన్‌గా కొలింపల్లె

0 123

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు ఉదృతి కొనసాగుతోంది. దిగువపల్లె పంచాయతీ కొలింపల్లెలో ఒకే రోజు నాలుగు పాజిటీవ్‌ కేసులు నమోదు కావడంతో గురువారం కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు స్పెషలాఫీసర్‌ చంద్రమౌళి లు తెలిపారు. గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావణంను పిచికారి చేశారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కోవిడ్‌ తో  హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్నారు. ఆయన వెంట ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌, విఆర్వో నారాయణ, తదితరులున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Kolimpalle as a cantonment zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page