కరోనా 3వ అల ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ప్రధానమంత్రికి ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి

0 24

నెల్లూరు ముచ్చట్లు:
కరోనా వైరస్ తొలి దశ, మలిదశలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారని, రానున్న న కరోనా 3వ అల ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం  సిద్ధంగా ఉండాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ విజ్ఞప్తి చేసింది.
కరోనా 2వ అల తీవ్రత  వలన మన దేశ వ్యాప్తంగా అనేకమంది కరోనా రోగులు తమ ప్రాణాలను కోల్పోయారని,మరోవైపు దీని తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి అని పేర్కొన్నారు. దీనికి పరిష్కారం అందరికీ వ్యాక్సిన్ అందించడమే ప్రధాన కర్తవ్యం అన్నారు. అదే సందర్భంలో 3వ దశ  ఉపద్రవం పొంచి ఉన్నదని, అది పిల్లలపై మరింత ప్రభావం చూపుతుందని చర్చలు, వాదనలు విస్తృతంగా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు.
2019 కరోనా ఉపద్రవం,విపత్తు వలన ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మంది ప్రజలు కరోనా బారిన  పడడమే కాకుండా సుమారు 35 లక్షల మంది చనిపోయారు తెలిపారు. భారత దేశంలో అయితే 2.8 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా,
3. 20 లక్షల మందికి కరోనా రోగులు చనిపోవడం జరిగిందన్నారు. మొదటగా భారత దేశమే కరోన నివారణ చికిత్స కొరకు వ్యాక్సిన్ కనుగొనేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం అన్నారు. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వలన ఇప్పటివరకు 20 కోట్ల డోసులు మాత్రమే తయారు చేయగలిగారు అని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్   ఉత్పత్తిని వేగవంతం చేసి, ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే చర్యలకు ఉపక్రమించాలని, ప్రజారోగ్య వేదిక కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు.అదే సందర్భంలో కరోనా 3వ అల ఉపద్రవం రాబోతుందని, దాని ప్రభావం పిల్లలపై మరింత ఉంటుందన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ,దాన్ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని,తగిన ఏర్పాట్లతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ప్రజారోగ్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ యం వి రమణయ్య, ప్రధాన కార్యదర్శి  టి. కామేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:The corona must be prepared to withstand the 3rd wave catastrophe
Public Health Forum appeals to PM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page