తరిమెల ఇసుక రీచ్ రద్దు చేయాలి

0 13

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా సింగనమల మండ లం తరిమేల ఇసుక రీచ్ అక్రమాల పరిశీలనకు వెళుతున్న రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులును అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషనకు పోలీసు లు తరలించారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ ను పదిమంది రైతులను శింగనమల పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారు. సింగనమల మండలంలోని పెన్నా పరివాహక ప్రాంతాలైన ఇల్లూరు, కల్లుమడి, తరిమెల, నిదనవాడ, రాచేపల్లి గ్రామాలలో ప్రభుత్వం అక్రమంగా ఇసుక రీచ్ ను ఏర్పాటు చేసింది. ఇసుకను తరలింపు ద్వారా వేలాదిమంది రైతుల పండ్ల తోటలు ,అహరపంటలు రైతులు కోల్పోతారు . రైతులు  జీవనాధారం కోల్పోతారు. ఈ విషయం పై జిల్లా అధికారులకు రైతులు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. దీని కి ప్రత్యామ్నాయంగా చాగల్లు రిజర్వాయర్ నుంచి పది కిలోమీటర్లు ఇసుక ఉన్నదని దానిని తరలించి ఇసుక కొరత లేకుండా ఉంటుందని తెలిపిన పట్టించుకోలేదు.  తరిమెల గ్రామం లో అధికార పార్టీ రెండు గ్రూపుల మధ్య ఉన్న తగాదా వలన రైతులు బలి అవుతున్నారని అన్నారు.

 

 

 

 

- Advertisement -

ప్రభుత్వం తరిమెల ఇసుక రీచ్ లో ఇసుక తోడడం అపి ప్రత్యామ్నయంగా ఉన్న వనరుల మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.తరిమెల గ్రామంలో మైనింగ్ అధికారుల పరిమితికి మించి పెన్నా నది లోని ఇసుక తవ్వుతు న్నారు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట కూడా లారీలలో ఇసుక తోలుతున్నారు. ఈ విషయంపై రైతులతో సమావేశమైన అవ్వాలని నాగరాజు రైతు సంగం జిల్లా అధ్యక్షులు ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ రైతులతో సమావేశానికి సిద్ధమవుతుంటే పొద్దున్నే సింగనమల, గార్లదిన్నె పోలీసు ఎస్సై అధికారులు వచ్చి అక్రమంగా అరెస్టు చేశారు. మహిళలు అని చూడకుండా మహిళా కానిస్టేబుల్ లేకుండా అరెస్టు చేసి పోలీసు వాహనంలో సింగనమల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ అక్రమ అరెస్టుల తో ఉద్యమాలను ఆపలేరనీ తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The sandy sand Reach should be canceled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page