నెల్లూరులో వేమిరెడ్డి ఎంటర్

0 14

నెల్లూరుముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెంగంతా అక్కడే. ఆ జిల్లాను సెట్ చేయడం ఎవరి వల్లా కావడం లేదు. పేరుకు పెద్ద నేతలు. అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం. కానీ ఉన్నది ఐదేళ్లే. ఎక్కువమందికి కేబినెట్ లో చోటు కల్పించే వీలు కూడా లేదు. దీంతో వారిని ఎలా సముదాయించాలన్నది జగన్ కు అర్థం కాకుండా ఉందంటున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో చర్చించేందుకు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.నెల్లూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాల్లో జెండాను ఎగరేసింది. ఇక ఇక్కడ సీనియర్ నేతలకు కొదవలేదు. ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ సీనియర్ నేతలే. వీరిలో ఒక్క ఆనం రామనారాయణరెడ్డి తప్ప మిగిలిన వారంతా తొలి నుంచి జగన్ ను నమ్ముకున్నవారే.ప్రస్తుతం జగన్ కేబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు ఉన్నారు. వీరందరినీతొలగించినా ఎవరికి ఇవ్వాలన్న దానిపై జగన్ ఎటూ తేల్చుకోలేెకపోతున్నారట. అందరూ మంత్రిపదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. మరో ఆరు నెలల్లో తాము మంత్రి అయిపోతామని చెప్పేసుకుంటున్న వారు కూడా లేకపోలేదు. వీరిలో ఎవరికి మంత్రి పదవి దక్కకపోయినా అసంతృప్తి తలెత్తే అవకాశాలున్నాయి. సీనియర్ నేతలందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. రెండు మంత్రి పదవులు ఆ వర్గానికే ఇచ్చే అవకాశం లేదు. ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది.అందుకే జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించారంటున్నారు. వారి మనసులో ఏముందో తెలుసుకోవాలని, మంత్రి పదవి కాకుంటే మరే పదవి వారు కోరుకుంటున్నారో చెప్పాలని ఆరా తీసే బాధ్యతను జగన్ వేమిరెడ్డికి అప్పగించారంటున్నారు. దీంతో ఆయన విడివిడిగా అందరితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మొత్తం మీద మిగిలిన 12 జిల్లాల మాట ఎలాల ఉన్న నెల్లూరుకు వచ్చే సరికి జగన్ కు తలనొప్పులు తప్పవంటున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Enter Vemireddy in Nellore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page