పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిచే హెల్త్ సెంటర్ల కు శంఖుస్థాపన

0 131

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో రెండు హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం శంఖుస్థాపన చేశారు. పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో సెంటర్‌కు రూ.80 లక్షలు, టీటీడీ కళ్యాణమండపం వద్ద హెల్త్ సెంటర్‌కు రూ.80 , లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు సెంటర్లకు మంత్రి భూమి పూజ చేశారు. ఆరు నెలలోపు పూర్తి చేసి, ప్రజలకు వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపిలు రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్యెల్యే ద్వారకనాథరెడ్డి, బోయకొండ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, స్థానిక నాయకులు నాగభూషణం, భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్‌, నాగరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Foundation stone laid for Health Centers at Punganur by Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page