పుత్తూరులో కరోనా కట్టడికి ఆయుర్వేద మందు తయారీ

0 67

చిత్తూరు ముచ్చట్లు :

 

కరోనా బాధితులకు ఆయుర్వేద మందుతో కట్టడి చేయవచ్చని, బొజ్జనత్తం ఆణిముత్యం, పారంపర్య వైద్య మహా సంఘం అద్యక్షులు, శల్యవైద్యులు ఎస్. చంద్రశేఖర్ రాజు తెలిపారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ దర్మరాజుల స్వామి ఆలయంలో కరోనా కట్టడి చేయడానికి, వ్యాధి నిరోదక శక్తిని పెంచడానికి ఆయుర్వేదం ద్వారా మందును తయారుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సెకండ్ వేవ్  నేపథ్యంలో చాలామంది ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. కరోనా కట్టడి చేయాలంటే మనిషిలో వ్యాథి నిరోదక శక్తిని పెంచుకోవాలని తెలిపారు. మందును తయారు చేయడానికి, అలాగే తయరు చేసే విదానాన్ని వివరించారు. నెల్లూరు జిల్లా, కృష్టపట్నం లోని ఆనందయ్య కోవిడ్ భాదితులకు ఇస్తున్న మందును, అదే పార్ములా ను ఉపయోగించి ఇక్కడే తయారుచేయునున్నట్ల ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

తయారుచేయునున్న మందు పూర్తిగా ఆయుర్వేదంతో కూడుకున్నదని, మనకు చుట్టు పక్కల దొరకే వస్తువులతోనే దీనిని తయారు చేయునున్నట్లు తెలిపారు. కాగ ఇది తయారు చేయడానికి సుమారు 10 గంటల పైన పడుతుందని తెలిపారు. పూర్తిగా తయారుచేసిన తరువాత పుత్తూరు మున్సిపల్, తహశీల్దారు, పోలీసులు ఆథ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్  బారిన పడి, వ్యాథి నిరోదక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికై ప్రభుత్వం ఆయుర్వేదాన్ని, ఆయుర్వేద వైద్యన్ని గుర్తించి తగిన విదంగా పోత్సహం ఇవ్వాలని కోరారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Preparation of Ayurvedic medicine for corona building in Puttur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page