పెళ్లి బరాత్ లో ఘర్షణ-ఒకరికి తీవ్రగాయాలు

0 53

-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

వికారాబాద్ ముచ్చట్లు :

 

- Advertisement -

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘోరిగడ్డ తాండాలో దారుణం జరిగింది. పెళ్ళికూతురు ఎదుర్కొలులో యువకుల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోట్లకు దారితీసింది. ఘోరిగడ్డ తాండాకు చెందిన రమేష్ అనే యువకుడి పెళ్ళి వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ రోజు ఉదయం పెళ్ళి కూతురును తాండాకు  తీసుకొచ్చి ఎదుర్కోలు చేస్తున్న సమయంలో యువకులంతా లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేసి డిజె పెట్టుకొని మద్యం మత్తులో డ్యాన్సులు వేశారు. ఒకరిపై ఒకరు తమ్సప్ చిమ్ముకుంటూ మైమరచి డ్యాన్సులు చేస్తున్న క్రమంలో యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా కత్తిపోట్లకు దారితీసింది.సంజయ్ అనే యువకుడు కత్తితో రాహుల్ అనే యువకుడిపై దాడికి తెగబడ్డాడు.ఈ క్రమంలో రాహుల్ కడుపులో కత్తి పోటు బలంగా తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. అతని కుటుంబ సభ్యులు రాహుల్ ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.పరారీలో ఉన్న సంజయ్ తో  పాటు ఘర్షణకు కారణమైన మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పెళ్ళి వేడుకల్లో పాల్గొని ఘర్షణ పడ్డ ఈ యువకులంతా ఘోరిగడ్డ తాండాకు చెందిన వారైనప్పటికి,జీవనాధారం కోసం పుణేలో స్థిరపడ్డ వీరు రమేష్ పెళ్ళి కోసం వచ్చారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Conflict in wedding barat-serious injuries to one

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page