పేదలందరికీ పక్కా గృహాలు  నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం    ఎమ్మెల్యే ఆర్థర్

0 17

పాములపాడు ముచ్చట్లు:

నిరుపేదల అందరికీ పక్కా గృహాలు  నిర్మించడమే  ప్రభుత్వ ధ్యేయమని  ఉన్నారు నందికొట్కూరు  శాసనసభ్యులు తోగురు ఆర్థర్ గురువారం నాడు పాములపాడు మండల పరిధిలోని తుమ్మలూరు, రుద్రవరం, జూటూరు గ్రామాల హౌసింగ్ లే అవుట్ లో *గృహముల నిర్మాణమునకు ప్రారంభోత్సవం చేయడమైనది.ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మౌలిక వసతులను కల్పించి ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు.త్రాగునీటి బోర్లు, విద్యుత్ లైన్లు, రహదారులు తదితర సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. .ఒక పక్కా గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ 1.80 లక్షలు అందింస్తోందన్నారు. బిల్డింగ్ బేస్ మెంట్ లెవల్ అప్పుడు 40 బస్తాలు సిమెంట్, బేస్ మెంట్ లెవల్ పూర్తయితే రూ 35,200 డబ్బులు, మరియు 20 బస్తాల సిమెంట్, రూఫ్ లెవల్ లో రూ 43, 950 లు డబ్బులు మరియు 30 బస్తాల సిమెంట్, రూఫ్ కాంక్రీట్ కు 13,900 డబ్బులు, బిల్డింగ్ పూర్తయితే రూ 36, 700 డబ్బులను చెల్లించడం జరుగుతుందన్నారు. మరియు ట్రాక్టర్ల ఇసుకను కూడా అందచేయడం జరుగుతుందన్నారు. ఎంజి ఎన్ ఆర్ ఈ జి ఎస్ క్రింద రూ 30 వేలు ను జాబ్ కార్డ్స్ ద్వారా  అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ఎక్కడా ఎవ్వరికీ లంచాలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఇళ్ల పట్టాలు, పక్కా భవనాలు రాని వారికి కూడా అర్హతే ఆధారంగా అందచేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు ఎస్ఐ రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వరప్రసాద్  రుద్రవరం గ్రామ సర్పంచ్ రామస్వామి , జూటూరు సర్పంచ్ , పాములపాడు మండల తహసిల్దార్  గోపాల్ రావు , మండల అభివృద్ధి అధికారి  రానేమ్మ , గృహ నిర్మాణ శాఖ డి.ఈ. ప్రభాకర్ , ఏ.ఈ. రామకృష్ణారెడ్డి , ఆర్. డబ్ల్యూ. ఎస్ డి ఈ విద్యాసాగర్ , ఏఈ అనంతనాగ్ , పాములపాడు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు  ముడియాల. శ్రీనివాస్ రెడ్డి ,  జి. రామలింగేశ్వర రెడ్డి ,  గ్రామాల నాయకులు మురహరి రాజన్న , జూటూరు రామస్వామి , పల్లె రమణ  మరియు ముఖ్యమైన నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The aim of the government is to build pucca houses for the poor
Ms. Arthur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page