పేదలవాళ్ల ప్రత్యక్ష దైవం ముఖ్యమంత్రి జగన్‌ – డిప్యూటి సీఎం నారాయణస్వామి

0 42

పుంగనూరు ముచ్చట్లు:

 

పేదవాళ్ల ప్రత్యక్ష దైవంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కొనియాడుతున్నారని డిప్యూటి సీఎం నారాయణస్వామి తెలిపారు. గురువారం పుంగనూరులోని నక్కబండ వద్ద మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఆయన జగనన్న కాలనీల శంఖుస్థాపనలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పేదలకు పంపిణీ చేసే ఇండ్ల స్థలాలకు అడ్డుపడుతున్న ధరిద్రుడని ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పక్కా ఇల్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసి, జగనన్న పట్టణాలు ఏర్పాటౌతోందన్నారు. ముఖ్యంగా ఇండ్ల వద్ద కొబ్బరిచెట్లు నాటించాలని , అలాగే కాలనీల పక్కల్లో స్మశాన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణ్‌ను ఆదేశించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Chief Minister Jagan is the direct deity of the poor – Deputy CM Narayanaswamy

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page