రక్షణవ్యవస్థ స్వీయ విధ్వంసకంగా మారటం వల్లే కరోనా సమస్య తీవ్రతరం

0 30

• రక్తం గడ్డకట్టటంతో ఆక్సిజన్‌ సమస్య గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు
• దీనికి పరిష్కారం స్టెరాయిడ్లు, యాంటీ క్లాటింగ్‌ ఔషధాలు
• నిమోనియాగా భావించి చికిత్స ఇవ్వటంతో ప్రాణాలు పోతున్నాయి
• ఢిల్లీ  వైద్యుడు డాక్టర్‌ మాథ్యూ వర్ఘీస్‌ వెల్లడి

న్యూ డిల్లీ ముచ్చట్లు:

- Advertisement -

మనల్ని కాపాడే రోగనిరోధకవ్యవస్థే మనకు శత్రువుగా మారితే.. ప్రస్తుతం కరోనా విజృంభణలో అదే జరుగుతున్నది. కరోనా వైరస్‌పై పోరాడే యాంటీబాడీలు ఆ వైరస్‌లాగే ఉండే సాధారణ కణాలపై కూడా దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. దీనిని
అడ్డుకోకుండా.. దగ్గు, శ్వాస సమస్యలకు కారణం నిమోనియా అని భావించి చికిత్స అందిస్తుండటం వల్ల పరిస్థితి విషమించి ప్రాణాలు పోతున్నాయని ఢిల్లీలో ప్రజావైద్యుడిగా పేరొందిన, సెయింట్‌ స్టీఫెన్స్‌ హాస్పిటల్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ మాథ్యూ వర్ఘీస్‌
వెల్లడించారు. కరోనా బారిన పడినా కూడా సరైన సమయంలో సరైన చికిత్సతో బయటపడవచ్చని చెబుతున్నారు.
దేశంలో కరోనా బారిన పడినవారిలో 80% మంది తొలి 3-4 రోజుల్లో గొంతునొప్పి, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పి అరుదుగా విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడి ఆ తర్వాత దాన్నించి బయటపడుతున్నారు. కానీ, మిగిలిన 15-
20% మందిలోనే సమస్య తీవ్రమవుతున్నది. వీరిలో ఐదురోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోవటం, దగ్గు తీవ్రం కావటం, శ్వాస తీసుకోవటం కష్టం కావటం జరుగుతోంది. వీరికే సరైన సమయంలో సరైన చికిత్స అందించటం కీలకం. అయితే,
ఇక్కడ సాధారణంగా జరుగుతున్న పొరపాటు ఏమిటంటే.. రోగి ఛాతీ ఎక్స్‌రే చూసి నిమోనియా సోకిందని భావించి ఆ చికిత్స ప్రారంభిస్తున్నారు. కానీ, ఇది నిమోనియా కాదు. ఇటలీలో కరోనా మృతులపై జరిగిన పోస్ట్‌మార్టం పరిశోధనల వల్ల
తేలిందేమిటంటే.. దగ్గు, శ్వాస సమస్య వంటివి నిమోనియా కారణంగా రావటం లేదు. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవటంతో ఈ సమస్య తలెత్తుతున్నదని వారు గుర్తించారు.
• కరోనా వైరస్‌పై పోరాటానికి మన రోగనిరోధకవ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు.. వైరస్‌ మీద యుద్ధం చేయటంతోపాటు, వైరస్‌లాగే ఉండే ప్రోటీన్లపై కూడా పొరపాటున దాడి చేస్తున్నాయి.
• దీనివల్ల ఆ ప్రోటీన్లతో కూడిన కణాలు ధ్వంసమై రక్తనాళాల లోపలిపొరల్లో అతుక్కుంటున్నాయి. దీంతో రక్తంగడ్డకడుతుంది.
• దీంతో అటు ఊపిరితిత్తులకు, ఇటు మెదడుకు అందే ఆక్సిజన్‌లో ఆటంకం తలెత్తుతున్నది. ఫలితంగా ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి, దవాఖానలో చేరి వెంటిలేటర్‌ వంటి చికిత్స తీసుకునే పరిస్థితి తలెత్తుతున్నది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The corona problem is exacerbated as the defense system becomes self-destructive

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page