రఘురాముడి చుట్టూ రాజకీయాలు

0 20

ఏలూరు ముచ్చట్లు:

 

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు వ్యవ‌హారం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేసినందుకు, కులాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చగొట్టార‌న్న కార‌ణంతో ఆయ‌న్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ర‌ఘురామ కృష్ణంరాజు రాజ‌కీయ ప్రస్థానం చూసుకుంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత వ‌యా వైసీపీ, బీజేపీ, టీడీపీ నుంచి తిరిగి చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిపోయారు. వాస్తవానికి 2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న వైసీపీ ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నా చివ‌ర్లో జ‌గ‌న్‌తో విబేధించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ర‌ఘురామ కృష్ణంరాజు న‌ర‌సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బ‌రిలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి టీడీపీకి బైబై చెప్పేసి వైసీపీలోకి వ‌చ్చి ఎంపీ అయ్యారుచంద్రబాబు కొన్ని కార‌ణాల వ‌ల్ల ర‌ఘురామ కృష్ణంరాజుకు సీటు ఇచ్చే విష‌యంలో నాన్చడంతో అస‌హ‌నంతోనే ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చార‌ని ఒక టాక్ ఉంది. అలా కాదు.. రాజు చేయించుకున్న స‌ర్వేలో టీడీపీ ఓడిపోతుంద‌ని తేల‌డంతోనే ఆయ‌న టీడీపీ టిక్కెట్ వ‌దులుకుని వైసీపీలోకి వ‌చ్చి ఎంపీ అయ్యార‌ని కూడా అంటారు. ఏదేమైనా గ‌త ఆరేడేళ్లుగా ఎంపీ అవ్వాల‌ని క‌న్న క‌ల‌లు నెర‌వేరాయి. అయితే ఎంపీ అయిన ఆరు నెల‌ల నుంచే ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీకి క్రమ‌క్రమంగా దూరం కావ‌డం.. చివ‌ర‌కు జ‌గ‌న్ సైతం ఆయ‌న్ను పార్టీ నుంచి వ‌దిలించుకోవాల‌ని ప్రయ‌త్నించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.క‌ట్ చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌ఘురామ కృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ఇప్పటి నుంచే అనేక ఈక్వేష‌న్లను న‌ర‌సాపురానికి ప‌రిశీలిస్తున్నారు. వైసీపీ నుంచి ర‌ఘురామ‌కు ఎలాగూ ఎంపీ టిక్కెట్ రాదు.

 

 

 

 

- Advertisement -

అయినా ర‌ఘురామ కృష్ణంరాజుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే న‌ర‌సాపురం నుంచి ఎంపీ సీటు వ‌స్తుంద‌న్న ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. అక్కడే ఉంది ట్విస్ట్‌. ర‌ఘుకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగూ రెడీగానే ఉన్నారు. పైగా ఇప్పుడు ఆయ‌న‌కు టీడీపీ కార్యక‌ర్తలు, నేత‌లు, అధిష్టానం నుంచి మామూలు స‌పోర్ట్ లేదు. చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యక‌ర్తల వ‌ర‌కు ర‌ఘుకు అన్యాయం జ‌రిగింద‌ని గొంతెత్తడంతో పాటు సోష‌ల్ మీడియాలోనూ, అటు ఫ్లెక్సీల రూపంలోనూ తిరుగులేని మ‌ద్దతు అందిస్తున్నారు.ఇక ర‌ఘురామ కృష్ణంరాజుకు ఎలాగూ బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ – జ‌న‌సేన వాళ్లు అయినా ర‌ఘుకు ఎంపీ సీటు ఇవ్వడంలో ఎలాంటి డౌట్లు ఉండ‌వు.

 

 

 

 

అధికార పార్టీ ఎంపీగా ఉండి జ‌గ‌న్‌ను ఢీకొట్టిన ధిశాలి అని ఈ మూడు పార్టీల వాళ్లు ఆయ‌న్ను కీర్తిస్తున్నారు. పైగా తెలంగాణ బీజేపీ నేత‌ల నుంచి కూడా ర‌ఘురామ కృష్ణంరాజుకు ఫుల్లుగా స‌పోర్ట్ ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దల‌తోనూ పాత ప‌రిచ‌యాలు ఎలాగూ ఉండ‌నే ఉన్నాయి. ఈ క్రమంలోనే జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌క్కన పెట్టినా, ఎంపీ సీటు ఇవ్వక‌పోయినా ర‌ఘురామ కృష్ణంరాజుకు ఎంపీ సీటు ఇచ్చేందుకు మూడు పార్టీలు రెడ్ కార్పెట్ వేసి రెడీగా ఉన్నాయ‌న్న చ‌ర్చలే ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Politics around Raghuramudi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page