రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం-సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి

0 128

రామసముద్రం ముచ్చట్లు:

 

రైతుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని మాలేనత్తం సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సచివాలయం వద్ద రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాయం సిబ్బంది, వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ అశోక్ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Government Mission for the Development of Farmers-Sarpanch Kondur Srinathreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page