వాక్సినేషన్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం

0 15

 

వ్యాక్సిన్ అందరికి అందేలా చూసేలా కార్యాచరణ సిద్ధం చేయాలి

- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 

జగిత్యాల ముచ్చట్లు:

వాక్సినేషన్ నిర్వహాణలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జూమ్ మీటింగ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి, వ్యాక్సినేషన్ బాధ్యత రాష్ట్రాలపై వదిలేయడంతో వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేక పోయిందని, ఏఐసీసీ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ త్వరతగతిన పూర్తి అయ్యి, వ్యాక్సిన్ అందరికి అందేలా చూసేలా కార్యాచరణ సిద్ధం చెయ్యాలని, ముఖ్యంగా మరో నాలుగు నెలల్లో థర్డ్ వేవ్ ప్రభావం పొంచిఉన్న నేపథ్యంలో అంతకు ముందుగానే జూన్, జులై, ఆగస్టు నెలల్లోనే అందరికి వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వాలపై ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలని, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనాకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నాయని అన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అలాంటి చర్యలు నేటికీ చేపట్టడం లేదని, దీంతో నిరుపేద వర్గాలు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆ కుటుంబాలు చిన్నాభిన్న అవుతున్నాయని, ఎవరి ఖర్మ వారిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజలందరికి ఉచిత శస్త్ర చికిత్సలు అందించాలని అన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వ్యక్తుల ఖర్చులను రియాంబర్స్ రూపంలో ప్రభుత్వం విడుదల చెయ్యాలని, వీలయితే కరోనా తో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్షగ్రెషియా తో పాటుగా, మరణించిన వారి కుటుంబల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, అందరికి వ్యాక్సినేషన్, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత కరోనా చికిత్స, కరోనా చికిత్స చేయించుకున్న వారికి మెడికల్ రియాంబర్స్మెంట్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరుపున విన్నవించడంతో పాటుగా, అవసరమైతే ప్రభుత్వం పై మరింతగా ఒత్తిడి పెంచే విధంగా నిరసన కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ పిలుపు నివ్వాలని జూమ్ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Central and state governments are a complete failure in vaccination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page