వైయస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు

0 8

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు గ్రా మీణ నియోజకవర్గ పరిధిలోని, అక్కచెరువుపాడులో నవరత్నాలలో భాగంగా, వైయస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలకు శుక్రవారం స్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గా స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ,డెవలప్మెంట్ జేసీ గణేష్ కుమార్ ,మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్ ,విజయాడైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ళు లేని ప్రతీ పేదవాడికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో  కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ 94 శాతం పైచిలుకు ఇచ్చిన మాట ప్రకారమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలో ప్రధాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి రాజీలేని కృషి చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Concreting for housing schemes of Vyassar Jagannath Colonies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page