సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్

0 6

జగిత్యాల ముచ్చట్లు:

రాబోయే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ అన్నారు.  గురువారం  కీటక జనిత వ్యాధులపై జిల్లాలోని పట్టణ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.ముఖ్యంగా ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలైన మలేరియా, డెంగ్యు ,చికెన్ గునియా మరియు ఫైలేరియా మొదలగు వ్యాధుల గురించి చర్చించారు.  ప్రతి సంవత్సరం జూన్ మాసాన్ని మలేరియా మాసంగా గుర్తించడం జరిగుతుందని అన్నారు. గ్రామ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో రాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.   అత్యవసర సమయంలో ఈ టీం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొనడం వల్ల వ్యాదులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. ప్రతి శుక్రవారాన్ని- డ్రై-  డే గా గుర్తిస్తూ నివాసాలలో పేరుకుపోయిన నిలువ నీటిని ప్రతి శుక్రవారం తొలగించి దోమలు పెరుగే స్థలాలను తొలగించడం వల్ల దోమల వృద్ధిని నివారించవచ్చని సూచించారు. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణలో భాగంగా సంబంధమున్న శాఖల మధ్య సమన్వయం చేకూర్చడానికి వివిధ శాఖల మధ్య  కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే ఈ కాలంలో సంభవించే వ్యాధులను అరికట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడి టీచర్లను, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు కుల సంఘాల పెద్దల ద్వారా వార్డులో వర్షాకాలం దృష్ట్యా వివిధ ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నా ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే  హై రిస్క్ ఏరియాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు .అవసరమైనచో నీటి నిలువలలో గంబూచియ చేపలను చేరవేయాలని  సూచించారు. వీటి ద్వారా దోమల లార్వాలను అరికట్టవచ్చునన్నారు..ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సమీయొద్దిన్, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీపతి పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Precautions should be taken against seasonal diseases
Puppala Sridhar, District Medical and Health Officer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page