సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్ మంత్రి తానేటి వనిత

0 29

కొవ్వూరు ముచ్చట్లు:

పేదవారి సొంతింటి కలకు సాకారం చేసే విధంగా గృహాలు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరు  మండలం కాపవరం గ్రామంలో  233  ఇళ్ల నిర్మాణ శంకు స్థాపన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. నేడు నవరత్నాలు – పేదలంద రికి ఇళ్లు వర్చువల్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణప్రారంభ మహోత్సవం కార్యక్రమం తదనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ  కొవ్వూరు నియోజకవర్గం లో 12603 ఇళ్లు మంజూరు అయ్యాయని, 6680 మంది లబ్ది దారులు ముందుకు వచ్చారన్నారు.
పేదరికం అడ్డు కాకూడదు అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు ఆపలేదు అని అన్నారు. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి భారీగా గృహనిర్మాణం వైయస్‌ ఆర్‌ జగనన్న కాలనీల గృహ నిర్మా ణం ప్రారంభం కావడం శుభ పరిణామం అని అన్నారు.
రూ.28,084 కోట్లతో మొదటి దశలో 15.60 లక్షల పక్కాగృ హాల నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రెండో దశలో రూ.22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. 2023 నాటికి ‘నవర త్నాలు- పేదలందరికీ ఇళ్ళు’ హామీ పూర్తి అవుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇంటి స్థలం, ప్రభుత్వ చేయూతతో పక్కాగృహం నిర్మించి ఇవ్వాలన్న సీఎం వైయస్ జగన్ లక్ష్యం కార్యరూపం దాలుస్తోంది అన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:CM Jagan fulfills own dream
The minister is a woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page