అందరూ అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తతో ఉండాలి పుచ్చకాయల మాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రావణి

0 27

పత్తికొండ   ముచ్చట్లు :

వ్యాపిస్తున్న కరోనా వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తలో ఉండాలని పుచ్చకాయల మాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి శ్రావణి అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ కరోనా ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. కరోనా వైరస్ ను సంపూర్ణంగా తరిమివేయడానికి అందరూ మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, చేతులకు శానిటేషన్ చేసుకోవాలన్నారు. కోవిడ్-19 నిబంధనలను అందరూ పాటించి తీరాలన్నారు. కుటుంబంలో కరోనా పట్ల ఒకరు చేసిన పొరపాటుకు అందరూ ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 25 పాజిటివ్ కేసులు నమోదు చేశామన్నారు. మే 25, 26, 27, 29, 30, 31, జూన్ 1వ తేదీల్లో మండలం లో 37 కేసులు నమోదు అయినాయన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వారికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ కేసులు తక్కువ వస్తున్నాయన్నారు. అధికారులు, వైద్యులు చెబుతున్న సూచనలు సలహాలను పాటించడం వల్ల కూలీల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయన్నారు. ప్రధానంగా షుగర్, బిపి రోగులు, వృద్ధులు, చిన్నారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనాను జయించవచ్చన్నారు. జ్వరాలు వచ్చినా వెంటనే అందుబాటులోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోని, నిబంధనలను అందరూ పాటించాలన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Everyone should be vigilant and precautionary
Dr. Sravani, Medical Officer, Watermelon Mada Primary Health Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page