ఆనందయ్య మందు..ఇలా

0 61

హైదరాబాద్  ముచ్చట్లు:

కరోనా నివారణ కో సం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ మందును ఇప్పటికే కొందరు తీసుకోగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఈ మందును ఎలా తీసుకోవాలి.? ఎవరు వాడకూడదు.?
కరోనా రాని వారు..
– కరోనా రాని వారు ‘పి’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా రెండు రోజులు తీసుకోవాలి.
– తిరిగి పది రోజుల తర్వాత ఇదే విధంగా మళ్లీ ఒక్క రోజు మందు వేసుకోవాలి.
కరోనా వచ్చిన వారు..
– ‘పి’ అనే రకం మందును.. ఉదయాన్నే పరగడపున చింతగింజ సైజులో వేసుకోవాలి.
– మళ్లీ రాత్రి భోజనానికి ముందు చింతగింజ సైజులో వేసుకోవాలి. ( ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
– ‘ఎఫ్’ అనే రకం మందును ఉదయాన్నే టిఫిన్‌తో పాటు గోలీ సైజులో వేసుకోవాలి. ( పి రకం మందు తీసుకున్న 30 నిమిషాల తర్వాత వేసుకోవాలి.
– ఇలా ఎఫ్ రకం మందును 2 రోజులు తీసుకోవాలి.
– ‘ఎల్ ’ అనే రకం మందును భోజనం ముందు గోలీ సైజులో వేసుకోవాలి. ( ‘ఎఫ్’ రకం మందు తీసుకున్న 3 గంటల తర్వాత ఇది వేసుకోవాలి).
– ఇలా మూడు రోజులు తీసుకోవాలి.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఎఫ్, ఎల్  మూడవ రోజు కూడా తీసుకోవచ్చు.
ఆక్సీజన్ లెవల్స్ తగ్గిన వారికి కంటి చుక్కల మందు.. (అయితే..ఇప్పుడు రెడీగా లేదు)
– ‘ఐ’ అనే రకం మందు రెండు కళ్లలో ఒక్క చుక్క చొప్పున వేసుకుని 5 నిమిషాలు వెయిట్ చేయాలి.
– ఒకవేళ కళ్లు మంటలు రాకపోతే పైన తెలిపిన విధంగా 2 సార్లు 15 నిమిషాల వ్యవధిలో వేయవలెను.
ముఖ్య గమనిక..
– మందు తీసుకున్నాక మాంసాహారం తినరాదు.
– గర్భిణీలు వాడరాదు.
– మహిళలు రుతు క్రమం సమయంలో వాడరాదు.
– మందును ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
– ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి.
– రోజులో 5 లీటర్లు తక్కువ కాకుండా నీరు తీసుకోవాలి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Anandayya mandu..ila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page