ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులా? :తుల ఉమ

0 16

హైదరాబాద్  ముచ్చట్లు :
ప్రజలతో మమ్మల్ని వేరు చేసే కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అర్హత లేదా? అని ఆమె ప్రశ్నించారు. మేము ప్రజా పోరాటాల్లో ఉన్నవాళ్లమన్నారు. ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులా? అని తుల ఉమ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి పదవులు ఎలా ఇస్తారని నిలదీశారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా జర్మనీలో ఉంటున్నా ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తుల ఉమ పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Are the movement traitors in office again? : Libra Uma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page