ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ దామోదరం

0 38

* మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.1.50 లక్షల డిమాండ్
* నగదు తీసుకున్న సబ్ రిజిస్ట్రార్..
* రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

 

పాకాల ముచ్చట్లు:

 

- Advertisement -

ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కు రూ.1.50 లక్షల నగదును సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి దాచమని ఇచ్చాడు. అప్పటికే బాధితుల పిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ను రెడ్ హ్యాండెడ్ గా పాట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లా భక్ష్, జనార్ధన నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు.. నాని ప్రసాద్ నుంచి యల్లా దామోదర్ ప్రసాద్ రూ.46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేట మిట్టవద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించగా రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Damodaram, Sub-Registrar of Cups in the ACB NetworkMore about this source textSource text required for additional translation information

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page