కరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమం.. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0 10

జగిత్యాలముచ్చట్లు :

కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికి సంక్షేమం ఆగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని,అందుకనుగుణంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి చేసుకుంటున్నామని  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.శుక్రవారం
పట్టణంలోని 7 వ వార్డులో సీసీ రోడ్డు,డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరన్న కాలంగా కరోనా మహమ్మారితో తీవ్రస్దాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,అయిన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం ఎక్కడా ఆగలేదని అన్నారు.. అభివృద్ధితో పాటు ప్రతివార్డులో మొక్కలు నాటేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని,భావి తరలకు వృక్షసంపదను అందించాలని కోరారు.కరోనా నివారణకు ప్రతివార్డులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తున్నామని,ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్దానిక కౌన్సిలర్ వల్లెపు రేణుకమొగిలి,కౌన్సిలర్లు గుగ్గిళ్ల హరీష్,పంబాల రాము,మల్లవ్వ తిరుమలయ్య,క్యాదాసు నవీన్,రాజ్ కుమార్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ రావు,వొళ్ళెం మల్లేశం, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,సెక్రటరీ శరత్ రావు,లక్ష్మణ్, వెంకటేష్ ,ప్రతాప్,అడువల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Corona welfare that does not stop even in difficult times ..
MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page