కోవిడ్ పై అవగాహన

0 16

పీలేరు   ముచ్చట్లు :
కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా, పీలేరు అర్బన్ మరియు రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందిచే వాహనాల ర్యాలీ నిర్వహించారు.ర్యాలీని మదనపల్లి డిఎస్పి రవి మనోహరాచారి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు కరోనా పై అవగాహన కల్పించుటకు పోలీసు సిబ్బందిచే వాహన ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వేలాది కోట్లాది రూపాయలు ఆదాయం వదులుకొని లాక్ డౌన్ పెట్టిందని కరోనా కేసులు, మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయని ఇంకా పూర్తిగా తగ్గాలంటే కర్ఫ్యూ కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.కర్ఫ్యూ ని ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.పై ర్యాలీ స్థానిక  పోలీస్ స్టేషన్ నుండి కలికిరి టర్నింగ్, అజంతా మిట్ట, అంబేద్కర్ కూడలి, గాంధీ కూడలి, కడప రోడ్డు, కోటపల్లి, తిరుపతి రోడ్డు, గాంధీ కూడలి ,చిత్తూరు రోడ్డు మళ్ళీ తిరిగి గాంధీ కూడలి, అంబేద్కర్ కూడలి, జెండా మాను వీధి, శివాలయం వీధి మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగింది. పై కార్యక్రమంలో పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ, పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ, పీలేరు ఎస్ఐ తిప్పేస్వామి, కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి, కలకడ ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, కె.వి పల్లి ఎస్ఐ రామ్మోహన్, రొంపిచర్ల ఎస్ఐ హరిప్రసాద్, వైవి పాలెం ఎస్ఐ సోమశేఖర్, పీలేరు అర్బన్ మరియు రూరల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Awareness on cobid

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page