చిత్తూరు నగరంలో డబుల్ మర్డర్

0 68

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు నగరంలో శుక్రవారం జంట హత్యలు జరిగాయి. నగరంలోని సాంబయ్య కండ్రిక లో ఒక యువకుడు యువతిని హత్యచేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. యువతి కేకలు విని అలెర్ట్ అయిన స్థానికులు అతడ్ని పట్టుకొని చితక్కొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు సదరు యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సిఐ నరసింహరాజు అక్కడికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Double murder in Chittoor city

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page