చౌడేపల్లెలో జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంభానికి ఉపాధి పని కల్పించాలి

0 22

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంభానికి పనులు కల్పించాలని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్దకొండామర్రి సచివాలయంలో, సచివాలయ సిబ్బంది, ఉపాధిసిబ్బంది, వలంటీర్లుతో కలిసి సమీక్ష జరిగింది. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తప్పకుండా వంద రోజులు పనులు చేయాలని, ఆర్థికంగా తోడ్పాడుతోపాటు శాశ్వత వనరుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, కూలీలకు అవసరమైన పనులు గుర్తించి , ఆపనులు వెహోదలయ్యేలా చూడాలని సిబ్బందికి తెలిపారు. వలంటీర్ల పరిధిలో గల యాబై కుటుంభాల్లో ప్రతి కుటుంబం పనులకు వచ్చేలా చైతన్యం కల్పించాలన్నారు. జాబ్‌ కార్డు వలన కల్గే ప్రయోజనాలను వివరించారు. వైఎస్సార్‌ జలకళ ద్వారా అర్హులైన రైతులకు ఉచితంగా ప్రభుత్వం బోర్లు వేయించి మోటార్లు ఏర్పాటుచేస్తారన్నారు.పనులకు వచ్చిన కూలీల కుటుంభాలకు వంద రోజులు పనులు కల్పించాలని సూచించారు. అలాగే పందిళ్ళపల్లె, వెంగళపల్లె, ల్లో కూలీలతో చైతన్య సదస్సులు జరిగాయి. ఈ సమావేశంలో సర్పంచ్‌ జయసుధనాగభూషణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుకుమార్‌, ఏపిఏ శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Every family with a job card in Choudepalle should be provided employment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page