డాలర్ ఎఫెక్ట్ తో పడిపోయిన బంగారం

0 27

ముంబై  ముచ్చట్లు :

పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు ఈరోజు కూడా వెలవెలబోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి ధర కూడా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర శుక్రవారం దిగొచ్చింది. 0.13 శాతం తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,616కు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి నడిచింది. వెండి ధర 0.1 శాతం క్షీణతతో రూ.70,722కు తగ్గింది.బంగారం ధర గత సెషన్‌లో కూడా పడిపోయింది. ఏకంగా 2 శాతం పడిపోయింది. బంగారం ధర నిన్న రూ.950 తగ్గింది. అలాగే వెండి రూ.1800 తగ్గింది. అంటే పసిడి రేటు రెండు రోజుల్లోనే రూ.1000 పతనమైంది. వెండి రేటు ఏకంగా రూ.2 వేలు దిగొచ్చింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. బలమైన డాలర్ కారణంగా పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర 0.4 శాతం క్షీణతతో ఔన్స్‌కు 1862 డాలర్లకు పడిపోయింది. గత సెషన్‌లో పసిడి రేటు ఏకంగా 2 శాతం దిగొచ్చింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Fallen gold with dollar effect

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page