తేమ పేరిట రైతులకు మోసం బీజెపి పట్టణాధ్యక్షుడు అనిల్

0 21

జగిత్యాల    ముచ్చట్లు :

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ పిలుపు మేరకు బీజేపీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్ లోని పిఏసి కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కట్టుబడి చివరి గింజను కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులపై ఒత్తిడి తెస్తాం అన్నారు. తరుగు విషయంలో కూడా ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన విధానం లేకపోవడం ఒక్కో కేంద్రంలో ఒక్కో విధంగా తరుగు తీయడం ద్వారా రైతులను మోసం చేస్తున్నారన్నారు. లారీ డ్రైవర్లు కూడా రైతుల వద్ద డబ్బులు వసూళ్లు చేయడం శోచనీయం అన్నారు. నైరుతి రుతుపవనాలు ఎప్పుడు సరిగ్గా వస్తాయో తద్వారా వర్షాలు ఎంత మొత్తంలో కురుస్తాయో చెప్పే వాతావరణ శాఖ , వ్యవసాయ శాఖ వారికి ఈ విషయం చెప్పినట్లు అనిపించడం లేదని ఆరోపించారు. ఎక్కడ కూడా ముందస్తు ఏర్పాట్లు లేవని, ఇప్పటికైనా అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పట్టణ కిసామోర్చా అధ్యక్షులు ముద్దం రాము, యువమోర్చా జిల్లా అద్యక్షులు రేంటం జగదీష్ , యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి చుక్కల ప్రేం సాగర్, కిసాన్ మోర్చా నాయకులు కొండల్ రావు, ముద్దం గంగరెడ్డి, విజయ్, పార్టీ  నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Cheating on farmers in the name of moisture
BJP mayor Anil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page