దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు… కడప తాలూకా సిఐ నాగభూషణం

0 14

కడప   ముచ్చట్లు :

కొవిడ్ బాధితుల  సహాయకులకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని, పుణ్య కార్యమని  కడప తాలూకా సిఐ నాగభూషణం   పేర్కొన్నారు. యూపీ నరసింహారెడ్డి  చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు ప్రతిరోజు లాగే చేయు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  కడప తాలూకా సిఐ నాగభూషణం హాజరై అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ చేయడానికి ట్రస్ట్ లు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.యూపీ నరసింహా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్  మొదటి వేవ్ కరోనా లో ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు చేయూతగా సహాయ సహకారాలు అందించడం, అన్నదానం తోపాటు పలు సేవా కార్యక్రమాలు చేయుచున్న యూపీ నరసింహా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను ఆదర్శంగా తీసుకొని మరింతమంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. యూపీ నరసింహా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం హర్షనీయమన్నారు. రిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రతి రోజులాగే గురువారం దాదాపు 300 మందికి అన్నదానం చేసినట్లు ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ నాగభూషణం కు యూపీ నరసింహా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఎన్ హెచ్ ఆర్ పి ఫోరం సమక్షంలో శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూపీ నరసింహారెడ్డి  చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు శ్రీనివాసన్, సునీల్,  సంతోష్ కుమార్, హర్షవర్ధన్, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Of all the donations, Annadanam is the best, and there is no other donation beyond Annadanam …
Kadapa Taluka CI Nagbhushanam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page