దీదీ చుట్టూ ప్రదక్షిణలు

0 28

బెంగాల్  ముచ్చట్లు:

రాజకీయాలలో పార్టీలు మారడం సహజమైన విషయం. ఎన్నికల సమయంలో నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు స్వప్రయోజనాలు ఏ పార్టీలో అయితే బావుం టాయో బేరీజు వేసుకుని కండువాలు మార్చుకుంటారు. ఇక ఒక పార్టీ అధికారంలోకి రాగానే తమ పార్టీ వీడి అధికార పార్టీ లోకి జంప్ అవుతుంటారు. అదేమని అడిగితే తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇష్టం లేకపోయినా పార్టీ మార్చాల్సి వస్తుందని మొసలి కన్నీరు కారుస్తుంటారు. ఇది ప్రస్తుతం రాజకీయాలలో సహజాతి సహజం అయిపోయాయి. ఇక విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) పార్టీ లోనుండి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బిజేపీ లోకి జంప్ అయ్యారు. వారి లెక్కల ప్రకారం బిజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన మెజారిటీతో బిజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుందని అంచనా వేశారు. ఇందులో వారి పొరపాటు ఏమీ లేదు. ఎందుకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలని చాలెంజ్ గా తీసుకున్నాడు. తనకి కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీ సర్కారుని కూలదోసి కాషాయ జెండా ఎగుర వేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నే రంగంలోకి దించారు.ఈ పరిణామాలని బట్టి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) పార్టీ వీడి చాలా మంది బిజేపీ లోకి క్యూ కట్టారు. తీరా ఫలితాలు తారుమారు అయ్యి మమతా బెనర్జీ కి పశ్చిమ బెంగాల్ ప్రజలు పట్టం కట్టడంతో పార్టీ ఫిరాయించిన వాళ్ళలో అంతర్మధనం మొదలయ్యింది. బిజేపీ అధికారం లోకి వస్తే మంత్రులై పోవచ్చనుకున్నవారి కలలు అడియాశలయ్యాయి. దీంతో ఇప్పుడు వీళ్ళంతా దీదీ శరణు కోరుతున్నారు. వరుసగా దీదీ కి లేఖలు వ్రాస్తూ ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వీరిలో దీపేందు విశ్వాస్, సోనాలి గుహ లాంటి నాయకులు ఉన్నారు. పార్టీని వీడి పెద్ద పొరపాటు చేశామని పశ్చాత్తాప పడుతున్నారు. మరి వీరి అభ్యర్థనని మన్నించి దీదీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుందా.. లేదా అన్నది చూడాలి..

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Circles around Didi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page