పుష్ప రికార్డుల మోత

0 24

హైదరాబాద్  ముచ్చట్లు :
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ కాస్తా ఇప్పుడు ఐకాన్ స్టార్ అనిపించుకుంటున్నారు.పుష్ప సినిమాతో సుకుమార్ ఐకాన్ స్టార్ చేసేశారంటూ బన్నీ చెప్పుకొచ్చారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి. ఆర్య, ఆర్య 2 వంటి విభిన్న చిత్రాలు ఈ కాంబోలో ఇప్పటికే వచ్చాయి. ఇక ముచ్చటగా మూడోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు బన్నీ సుక్కు రెడీ అవుతున్నారు. పుష్ప అంటూ వదిలిన టీజర్, మోషన్ పోస్టర్, లుక్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.పుష్ప రాజ్‌ను పరిచయం చేస్తూ వదిలిన ఇంట్రో టీజర్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. బన్నీ బర్త్ డే సందర్బంగా వదిలిన ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన టీజర్లు మన టాలీవుడ్‌లో చాలా తక్కువ. ఆ జాబితాలో ఫస్ట్ టైం పుష్ప చేరింది. ఇక ఇప్పుడు మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా యూట్యూబ్‌లో పుష్పటీజర్ 70 మిలియన్ల మంది వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నారు.ఈ మేరకు పుష్ప యూనిట్ ఓ ట్వీట్ వేసింది. 70 మిలియన్ల వ్యూస్‌ను మొదటిసారిగా, వేగంగా కొల్లగొట్టేసిన పుష్ప అంటూ ప్రకటించేశారు. ఇక ఇదే కాకుండా 1.6మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది. తగ్గేదేలే అంటూ పుష్ప టీం వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళం, తెలుగు, మళయాలం, కన్నడం, హిందీ ఇలా దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సుకుమార్ భారీ ప్లాన్ వేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అనుకున్న సమయానికి సినిమా వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:The size of the floral records

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page