ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే వైఎస్ఆర్సిపి లక్ష్యం      

0 27

ఎమ్మిగనూరు ముచ్చట్లు :

మండలం పరిధిలో బోడబండ గ్రామంలో   ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని వైయస్సార్సీపీ నాయకులు కోటేకల్లు లక్ష్నన్న, గుమ్మరాళ్ళ గోవిందురాజులు, వడ్డె హనుమతు, వడ్డె మధు, బచ్చాల నాగరాజు అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామం వద్ద వైయస్సార్ జగనన్న కాలనీలో నీటి సౌకర్యం కల్పించేందుకు బోరు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైయస్సార్సీపీ  నియోజకవర్గ ఇంచార్జి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ బీఆర్ బసరెడ్డి సహకారంతో జగనన్నకాలనీని నందనవనంగా తీర్చుదిద్దుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, ఉలువ గోవిందు, రాధాకృష్ణ, ప్రహ్లద పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:YSRCP aims to provide drinking water to every household

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page