భద్రాద్రిలో అందరి బంధువు జేడీ పౌండేషన్ అర్ధరాత్రి  పూట మహిళా వలస కార్మికులకు బాసట

0 12

భద్రాచలం   ముచ్చట్లు :

కరోనా వేళ “జేడీ పౌండేషన్” రూపంలో మానవత్వం వెల్లివిరిసింది.. గురువారం రాత్రి విశాఖపట్నం నుండి నలుగురు మహిళలు అందులో(ఒక స్త్రీ గర్భిణీ) భద్రాచలం వంట పని కోసం వచ్చి, ఆ పని ఇప్పిస్తాను అన్న వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో, దిక్కుతోచని పరిస్థితిలో భద్రాచలం రామాలయం వద్ద ఉండగా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు మరియు కానిస్టేబుల్ జేడీ ఫౌండేషన్ భాద్యుడు శ్రీ మురళి మోహన్ కుమార్ ని సంప్రదించగా వెంటనే స్పందించి వారికి భోజనాలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి కావడంతో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి వాళ్ళు ఉదయాన్నే వారి స్వస్థలం చేరుకోవడానికి దారి ప్రయాణ ఖర్చులు 3,200 రూపాయలు జెడి ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు ద్వారా అందించారు. ఊరు గాని ఊరు లో తమకు, అందులోనూ గర్భిణీ స్త్రీకి పట్టెడు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించి దేవుడి ల ఆదుకున్న శ్రీ మురళీ మోహన్ కుమార్ కి మరియు “జేడీ ఫౌండేషన్” కి రుణపడి ఉంటామని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా   మురళి మోహన్ కుమార్ తెలుపుతూ రాత్రి 11:00 సమయంలో మీడియా మిత్రులు సమాచారం మేరకు ఇప్పుడున్న కరోనా పరిస్థితి దృష్ట్యా  వారికి పంజా సునీల్ కాంత్ ని సంప్రదించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని, అలాగే వారికి ప్రయాణ ఖర్చులు నిమిత్తము 3,200 రూపాయలు డాక్టర్. విశ్వ నారాయణ (ఇంగ్లాండ్) వారి సహకారంతో అందజేశామని తెలిపారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The Jedi Foundation is a relative of everyone in Bhadradri
Basta for women migrant workers at midnight

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page