లా కాలేజ్ అభివృద్ధి కోసం జేసీ కి విద్యార్థుల వినతి

0 18

నెల్లూరు ముచ్చట్లు :

నెల్లూరు విఆర్ లా కాలేజ్ విద్యార్థులు, వి ఆర్ విద్యాసంస్థల ప్రత్యేక అధికారి ఇంచార్జి కలెక్టర్ ,
హరేంద్ర ప్రసాద్ ని శుక్రవారం కలిశారు. ఈసందర్భముగా జాయింట్ కలెక్టర్తో విద్యార్థులు మాట్లాడుతూ,కాలేజ్ లో జూనియర్ విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా,కొంతమంది సీనియర్లు మాట్లాడుతున్నారని  తెలియచేశారు.కాలేజ్ కు ఎంట్రన్స్ లో నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని,అత్యాధునిక సౌకర్యాలతో కాలేజ్ మూట్ కోర్టు , సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.ఇంగ్లీష్,హిస్టరీ సబ్జెక్ట్ లకు లెక్చరర్లను నియమించాలని కోరారు.లైబ్రరీలో విద్యార్థుల సౌకర్యార్థం మరిన్ని అడిషన్స్ అందుబాటులో ఉంచాలన్నారు.సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్,కాలేజ్ అభివృద్ధి కోసం , విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో లా కాలేజ్ విద్యార్థులు పార్థసారధి,కిరణ్,సుధీర్,శ్రీను,సత్యనారాయణ,సందీప్,ప్రశాంతి,సునీల్,జనార్దన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Students’ request to Jesse for Law College development

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page