శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గ ఆలయ కమిటీ బాధ్యతల స్వీకరణ..

0 19

కోరుట్ల   ముచ్చట్లు :

పట్టణంలోని  శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో
పద్మశాలి నూతన కార్యవర్గం కమిటీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ హజరై నూతన కమిటీ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులుగా : గుడ్ల మనోహర్, ఉపాధ్యక్షులుగా:  కటుకం రవి ( భారత్ సెల్ పాయింట్ ), ప్రధాన కార్యదర్శిగా : వాసాల గణేష్, సహాయ కార్యదర్శులుగా :  బండి సురేష్,  గోసికొండ కుమార స్వామి , డైరెక్టర్లుగా : కటుకం నారాయణ  ముల్క రాజేశం , మాసం శంకర్ , అందె రాజ్ కుమార్ ,  పిన్నంశెట్టి శ్రీనివాస్ ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షులు గుడ్ల మనోహర్ మాట్లాడుతూ కులబాంధవులు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్విఘ్నంగా కొనసాగిస్తామని, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే, నూతన కమిటీ ఆధ్వర్యంలో  ఆలయాన్ని మరింత  అభివృద్ధి పథంలోకి తీసుకపోతామన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం మధు, మున్సిపల్ కౌన్సిలర్  ఎంబేరి నాగ భూషణం, రాష్ట్ర చేనేత విభాగం నాయకులు  సదుబత్తుల హరిప్రసాద్, ముల్క ప్రసాద్, పద్మశాలి వయో వృద్ధుల సంఘం అధ్యక్షులు ఎక్కల్ దేవి గంగాధర్, కటుకం గణేష్ ,  గుండేటి ప్రసాద్, ఆలయ పురోహితులు ప్రదీప్ శర్మ, శ్రీధర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Assignment of responsibilities of Sri Sivamarkandeya Koti Navadurga Temple Committee ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page