ఆనందయ్య మందుతో 120 కోట్ల్లు

0 41

నెల్లూరు ముచ్చట్లు :

ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. వేలాది మంది కరోనా రోగులుఆనందయ్య మందు కోసం బారులుదీరుతుండడంతో సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం మందు శాస్త్రీయతపై అధ్యయనం చేయాలని పంపిణీని నిలిపివేసింది. ఇటీవల ఆయుష్, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఆనందయ్య కరోనా మందుని అమ్ముకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సిద్ధమయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు ఉచితంగా ఇస్తున్న మందుతో వ్యాపారం చేసి కోట్లు గడించేందుకు పథకం పన్నారని ఆయన ఆరోపించారు. గత నెల 21 నుంచే ఎమ్మెల్య కాకాణి కుట్రలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. అందుకోసం నకిలీ వెబ్‌సైట్‌ని కూడా రూపొందించారని సోమిరెడ్డి చెప్పారు.వైసీపీ నేతలకు చెందిన శ్రేషిత టెక్నాలజీ వద్ద వెబ్‌సైట్ కొనుగోలు చేసి ఇంటర్నెట్‌లో హెస్ట్ కూడా చేశారని.. వెంటనే డిలీట్ చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. వెబ్‌సైట్‌లో మందు రూ.15గా చూపించి ఇంటికి చేరే సరికి రూ.167 వసూలు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కోటి మందికి మందుని ఆన్‌లైన్ అమ్మడం ద్వారా 120 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ఎమ్మెల్యే కాకాణి కుట్రపన్నారని సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే కాకాణి ఆగడాలను అడ్డుకునే ధైర్యం జిల్లా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌కి కూడా లేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. కలెక్టర్, ఎస్పీ కూడా ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ సైట్ క్రియేట్ చేసి మోసం చేసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:120 crores with Anandayya Mandu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page