ఆశావర్కర్లకు  నిత్యవసర వస్తువుల పంపిణీ

0 25

యాదాద్రి భువనగిరి  ముచ్చట్లు :
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో జిల్లా ఇంచార్జి బుస్స రమేష్, వలిగొండ ఇంచార్జి ఆలకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రేటర్ నలగొండ ఎన్నారై ఫోరం సభ్యులు సుధీర్ రాజు సౌజన్యంతో బెడ్స్, శానిటైజర్, పల్స్ ఆక్సీ మీటర్లతో పాటు నిత్యవసర వస్తువులను ఆశావర్కర్లకు డిసిపి నారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ఆశ వర్కర్ల సేవలు అభినందనీయం అంతే కాకుండా అరూరు గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణ చేయాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులకు సహకరిస్తున్న గ్రామస్తులు అందరిని అభినందిస్తున్నా అని అన్నారు. డిసిపి నారాయణరెడ్డి ని గ్రేటర్ నల్గొండ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసిపి, ఎస్సై, డాక్టర్ లు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Distribution of daily necessities to Asha workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page