కుటుంబాల్లో కరోనా కల్లోలం

0 37

నిజామామాద్  ముచ్చట్లు :

 

కరోనా మహమ్మారి పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతోంది.కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తండ్రి కొడుకులు, అన్నా తమ్ములు, అక్కా చెల్లెల్లు, తల్లీ బిడ్డలు, ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురిని కరోనా బలితీసు కుంటోంది.తల్లి దండ్రులను కోల్పోయి ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలిన సంఘటన ఒకటి అందరిని కలిచివేస్తోంది.కామారెడ్డి జిల్లా కేంద్రం లోని పంచముఖి హనుమాన్ కాలనీ కి చెందిన రాజేష్ గత కొన్నేళ్ళుగా ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.భార్య స్రవంతి గృహిణి.వీరికి వైష్ణవి,వర్షిత అనే ఇద్దరుకూతుళ్లు. ఉన్నదాంట్లో సర్దుకు పోతూ  కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో వీరి కుటుంబంలో మాయదారి కరోనా  కోలుకోలేని దెబ్బ తీసింది.గతేడాది మొదటి వేవ్ లో రాజేష్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చేరగా  కరోనా సోకినట్లు తేలింది.ఇంట్లో ఉంటూ మందులు వాడి నాలుగు రోజుల తరువాత కన్నుమూ శాడు.భర్త ను కోల్పోయిన పుట్టెడు దుఃఖం లో భార్య కన్న తండ్రిని కోల్పోయిన బాధలో ఇద్దరు కూతుళ్లు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తుండగా మాయదారి వైరస్ మళ్ళీ వెంటాడింది.ఈ ఏడాది ఇంట్లో వాళ్లందరికీ సోకింది.రాజేష్ తల్లి సిద్దమ్మ భార్య స్రవంతి చిన్న కూతురు వర్శితతో పాటు మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. అందరూ కొలుకోగా స్రవంతి మాత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది.హైద్రాబాద్ కు తరలించగా చికిత్సపొందుతూ మరణించింది.దీంతో ఇద్దరు కూతుళ్లు వైష్ణవి వర్శిత లు అనాధలయ్యారు. నానమ్మ సిద్దమ్మ వీళ్ళ బాగోగులు చూసుకుంటోంది. ఐతే చివరి మజిలీలో  తనను కొడుకు కోడలు తన బాధ్యతలు చూసుకోవాల్సిన సమయం లో వాళ్లిద్దరూ దూరం కావడం వారి పిల్లలు సిద్దమ్మకు అదనపు భారంగా మారారు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు లో 16 లక్షల వరకు కొడుకు రాజేష్  అప్పు చేయగా స్రవంతి కరోనా వైద్యం కోసం 5 లక్షల వరకు ఖర్చయ్యింది.ఈ బాకీ ఎలా తీర్చా లో  తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతోంది సిద్దమ్మ.ఓవైపు అప్పులు మరో వైపు ఇద్దరు ఆడపిల్లల  పోషణ వారి భవిష్యత్తును తలచుకుంటూ కన్నీరు మున్నీరవుతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే తమను ఆదుకో వాలని వేడుకుంటున్నారు.
మా మామయ్య,అత్తమ్మ  మంచిగా బతుకుతదనుకున్న నన్ను మేన మామమంచిగా చుస్కున్తదని అనుకున్న  అని ఎంతన్న మురిసిపోయిన. కానీ కరోనాతో చనిపోయిండు. నా మరదల్లను బాగా చదివిస్తాదని అనుకున్న  చనిపోయిందని ఫోన్‌ రాగానే గుండెలు బాదు కున్నం. పిల్లలను చూస్తుంటే దుఖం వస్తోందని  పిల్లల మేనమామ బాధపడుతున్నారు.పిల్లల బాద్యత మొత్తం మా అమ్మమ్మ చూసుకుంటుంది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.కరోన మొదటి,సెకండ్ వెవ్ లో ఇద్దర్నీ కోల్పోయా పిల్లల్ని ఎట్లా సాదాలయ్యా’అంటూ చిన్నారులను దగ్గర పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న  కామారెడ్డికి చెందిన సిద్దవ్వ.తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటుంది.ఎలాంటి పరిస్థితులు పగ వారికీ కూడా రావద్దని వేడుకుంటున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Corona fluctuations in families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page