కొనకళ్ల..ఇంటికే పరిమితం…

0 28

విజయవాడ  ముచ్చట్లు :

2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇంత ఘోరమైన ఓటమితో పార్టీ నేత‌లు ఎక్కడికక్కడ చేష్టలుడిగి చూస్తున్నా సరే చంద్రబాబు ఈ వ‌య‌స్సులోనూ త‌న వంతుగా పోరాడుతూనే వస్తున్నారు. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయినా సరే బాబు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా అధ్యక్షులని పక్కనబెట్టి, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు.
అయితే ఈ అధ్యక్షులని నియమించి 10 నెలలు అవుతుంది. కానీ వీరిలో ఇద్దరు, ముగ్గురు మిన‌హా మిగిలిన నేత‌లు ఎవ్వరూ కూడా పెద్దగా పార్టీని బలోపేతం చేయలేకపోయారని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలు రాలేదు. టీడీపీకి కంచుకోటగా ఉండే కృష్ణా జిల్లాలో సైతం దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడున్న పార్లమెంట్ అధ్యక్షులు టీడీపీకి మంచి విజయాలు అందించలేదు. అయితే విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాస్త పర్వాలేదనిపిస్తున్నారు. ఆయన పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడు పార్టీ నేత‌లే పెద‌వి విరిచారు. ఓ అవుట్ డేటెడ్ నేత‌కు ఈ ప‌ద‌వా ? అని నోరెళ్లబెట్టిన వారే ఇప్పుడు నెట్టం యాక్టివ్‌గానే ఉంటున్నార‌ని మెచ్చుకుంటోన్న ప‌రిస్థితి. కానీ, మచిలీపట్నం అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దగా తిరగడం లేదు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు సాధించలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ దారుణంగా ఓడిపోయింది.అయితే విజయవాడ పరిధిలో కూడా టీడీపీకి ఘోరమైన ఫలితాలే వచ్చాయి. అలా అని నెట్టెం పార్టీని పట్టించుకోకుండా లేరు. నిత్యం తన పరిధిలో ఉన్న నియోజకవర్గాల నాయకులతో మాట్లాడుతూ, టీడీపీకి జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. పైగా ఇక్కడ కొన‌కళ్లకు పామ‌ర్రులో కాగిత గ్యాంగ్‌, బంద‌రులో కొల్లు ర‌వీంద్ర వ‌ర్గం, గ‌న్నవ‌రంలో టీడీపీ కేడ‌ర్‌తో విబేధాలు ఉన్నాయి. పైగా కొన‌కళ్లకు ఈ ప‌ద‌వి చేప‌ట్టడం సుత‌రామూ ఇష్టం లేదు. ఈ ప‌ద‌వి నాకెందుకు.. నా కుమారుడికి పెడ‌న ప‌గ్గాలు ఇస్తే చాల‌ని పార్టీ నేత‌ల‌తో అంటున్నార‌ట‌.నెట్టెంకు ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి చాలా గ్యాప్ వ‌చ్చినా.. ఇప్పుడు పార్టీ కష్ట‌కాలంలో ఉన్నప్పుడు తెర‌వెన‌క మానిట‌రింగ్ చేస్తుంటే వ‌రుస‌గా రెండు సార్లు ఎంపీగా గెలిచిన‌ కొనకళ్ళ నారాయణ మాత్రం అలాంటి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈయన ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో కొనకళ్ళ సైకిల్‌ని సమర్ధవంతంగా తొక్కలేకపోతున్నార‌ని పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Konakalla .. limited to home …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page