గర్భిణీలు, బాలింతలు, శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది     రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

0 52

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

గర్భిణీలు, బాలింతలు, శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు. మూడో దశ కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనున్నందున మనం మన పిల్లలను కాపాడుకునేందుకు మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఒక కంచె వలె నిలబడాలలన్నారు.కరోనా నివారణ, కట్టడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ, తగిన చర్యలు చేపడుతూ సంసిద్ధంగా ఉండాలన్నారు.బాలింతలు, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిపై నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.ఈ కష్ట కాలంలో ఇంటింటికి తిరుగుతూ నిత్యవసరాలు ఇస్తూ ప్రభుత్వంపై నమ్మకం పెంచుతున్న అంగన్వాడి లకు అభినందనలు తెలిపారు.కరోనా 3వ దశ పిల్లలపై ప్రభావం – కట్టడికి సంసిద్ధత పై అన్ని జిల్లాల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులతో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ కమిషనరేట్ లో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య గారితో ప్రారంభమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల పిల్లలను రక్షించవచ్చు అనే దానిపై మన దృష్టి ఉండాలి.తెలిసి తెలియని మారుమూల పల్లెల్లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు.గర్భిణీ, బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు.ఒకవేళ కోవిడ్ బారిన పడినా.. బయట పడే విధంగా సాయం అందించాలి.కోవిడ్ సమయంలో ఇంటింటికి నిత్యావసరాలు ఇస్తున్నాం. సర్వే బృందంలో మనం భాగంగా పని చేస్తున్న క్రమంలో మీరు తగిన జగృత్తలు తీసుకోవాలి.అమీన్ పూర్ సంఘటనపై అనేక శిశు కేంద్రాలను మూసి వేశాం. మరొక్కసారి మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? ఇబ్బంది పడుతున్నారా? అనే విషయాలు సమగ్రంగా తెల్సుకోవాలి. మన శాఖ తరపున సమర్థవంతమైన సేవలు అందించాలి.సీఎం కేసిఆర్ గారికి మన మీద చాలా నమ్మకం ఉంది. దీనిని నిలబెట్టుకోవాలి.మన పరిధి, బాధ్యత పెరిగినందున అప్రమత్తంగా ఉంటూ పని చేయాలి.మన రాష్ట్రంలోని పిల్లలు ఈ మూడో దశ బారిన పడకుండా మనం ఒక కంచె వలె వారికోసం తగిన సలహాలు ఇస్తూ, చర్యలు చేపడుతతూ పని చేయాలి.స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. పిల్లల పరిస్థితిని అధ్యయనం చేయాలి. మొదటి సమాచారం మనకు అందాలి. మనమే మొదట చేరి వారికి కావాల్సిన సేవలు అందించాలి.ఈ పనులు చేసే క్రమంలో ఏ ఇబ్బందులూ ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం.ఈ కరోనా సమయంలో మన శాఖ బాగా పని చేస్తుందని ఈ సందర్బంగా అందరికీ అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:We all have a responsibility to protect pregnant women, nursing mothers and babies
Minister of State for Tribal, Women and Child Welfare Satyavathi Rathore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page